Andhra Pradesh: ఇంద్రకీలాద్రి దేవస్థానం హుండీల్లో దొంగతనం.. నిందితుడు అరెస్టు

| Edited By: TV9 Telugu

May 07, 2024 | 12:47 PM

విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గగుడి హుండీల్లోని నగలు, డబ్బును దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దేవస్థానం ఉద్యోగి కగ్గా పుల్లారావుగా గుర్తించారు. మూడు కేసుల్లో అతడి నుంచి....

Andhra Pradesh: ఇంద్రకీలాద్రి దేవస్థానం హుండీల్లో దొంగతనం.. నిందితుడు అరెస్టు
Arrest
Follow us on

విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గగుడి హుండీల్లోని నగలు, డబ్బును దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దేవస్థానం ఉద్యోగి కగ్గా పుల్లారావుగా గుర్తించారు. మూడు కేసుల్లో అతడి నుంచి రూ.20 వేలు నగదు, 5 గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న దుర్గగుడి ప్రాంగణంలోని మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో దేవస్థానం హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపు సందర్భంగా 5 గ్రాముల బంగారు ఆభరణాలు మరుగుదొడ్డిలో లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ఈవో భ్రమరాంబ 10వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు, క్రైం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమేరాలను పరిశీలించారు. ఏప్రిల్‌ 11, 20 తేదీల్లో జరిగిన హుండీల్లో కానుకల లెక్కింపులో కూడా నిందితుడు రూ.16 వేలు నగదు అపహరించినట్లు విచారణలో అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు.

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడ్డాయి. మహామండపం వద్ద ఉన్న వాష్ రూమ్ లో బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అపహరించేందుకు యత్నించిన బంగారం విలువ సుమారు 5 గ్రాములు ఉంటుందని అధికారులు తేల్చారు. వీటి విలువ రూ.16 వేలు ఉంటుందని అంచనా వేశారు.

Also Read:

Sharad Pawar: ఎన్సీపీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు.. సినీనటి అరెస్ట్‌