మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య

|

Feb 21, 2021 | 9:43 PM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రీ దారుణ హత్యకు గురయ్యారు.

మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య
Follow us on

A Man murder : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రీ దారుణ హత్యకు గురయ్యారు. మొయినుద్దీన్ అనే వ్యక్తిని నజీర్, నవీన్ గౌడ్ అనే ఇద్దరు యువకులు కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగర శివారు శామీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంకర్ణాటకకు చెందిన మొయినుద్దీన్ గత కొంతకాలంగా మేస్త్రీ పని చేసుకుంటూ శామీర్‌పేట్ మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీలో నివాసముంటున్నాడు. ఆదివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన నజీర్, నవీన్ గౌడ్ మొయినుద్దీన్ ఇంటికి వచ్చారు. ఇంతలో ముగ్గురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతలోనే అతని ఇంట్లోనే కత్తితో పొడిచి నిందితులిద్దరు పారిపోయారు. ఈ హఠాత్తు పరిణామంతో షాక్‌కు గురైన మొయినుద్దీన్ కుమారుడు ఇరుగుపొరుగు వారిని పిలుచుకుని వచ్చేసరికి నజీర్, నవీన్ గౌడ్ పారిపోయారు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రక్తం మడుగులో పడిఉన్న మొయినుద్దీన్‌ను పోలీసు వాహనంలో హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరిలించారు. అయితే, అప్పటికే మొయినుద్దీన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసుల మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శామీర్‌పేట్ ఏసీపీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Read Also… Crime News: ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 77 లక్షలు మాయం.. సిమ్ కార్డు యాక్టివ్ చేయాలంటూ…