Road Accident: గేదెను తప్పించబోయి కిందపడిన బైక్.. ఇద్దరు చిన్నారుల మృతి..

Nalgonda Road Accident: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ పట్టణం గొల్లగూడ శివారులోని ఎఫ్‌సీఐ

Road Accident: గేదెను తప్పించబోయి కిందపడిన బైక్.. ఇద్దరు చిన్నారుల మృతి..
Road Accident

Updated on: Dec 15, 2021 | 2:29 PM

Nalgonda Road Accident: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ పట్టణం గొల్లగూడ శివారులోని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పల్సర్ బైక్‌పై వెళ్తుండగా.. గేదె అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేశారు. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని నెల్లూరు జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపు వెళ్తున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగి వెంటనే అంబులెన్స్ పిలిపించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. డాక్టర్లతో మాట్లాడి గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే కోరారు. కాగా.. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Shilpa Chaudhary: కిట్టీ పార్టీల కిలేడీ శిల్పా చౌదరికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు!

Tiger Skin: అన్నీ అనుమానాలే.. అసలు పులి చర్మం ఎక్కడ..? అటవీశాఖ దర్యాప్తులో షాకింగ్ విషయాలు!