రెండు వారాల వ్యవధిలో నలుగురు మోడల్స్ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.. తాజాగా మరో 18 ఏళ్ల ఔత్సాహిక మోడల్ ఆదివారం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. కోల్‌కతాలోని కస్బాలోని బేడియాదంగా వద్ద తన గదిలోనే విగతజీవిగా కనిపించించారు ప్రముఖ బెంగాలీ మోడల్ సరస్వతీ దాస్..సరస్వతీ దాస్ తెల్లవారుజామున 2గంటలకు ఉరి వేసుకుని ఉండటం గమనించిన ఆమె అమ్మమ్మ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించింది. కానీ, అప్పటికే సరస్వతీ దాస్ మృతిచెందినట్లు నిర్దరణ అయింది.
ఇంట్లో కుంటుంబ సభ్యులు ఎవరూ లేరు. దాస్, తన అమ్మమ్మతో పాటుగా ఉంది. రాత్రి ఇద్దరూ కలిసి నిద్రపోయారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సరస్వతి పక్కన లేకపోవడంతో ఆమె అమ్మమ్మ కంగారుపడి ఇల్లంత వెతకగా, మరో గదిల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిదని తెలిపారు. సరస్వతి తన తల్లి ఆరతి దాస్‌తో కలిసి ఉంటోంది. గత 17 సంవత్సరాలుగా తన తండ్రికి దూరం కావడంతో మేనమామ వద్ద నివసిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. “మాధ్యామిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక, ఆమె తన చదువును విడిచిపెట్టి, ట్యూషన్ చెప్పడం, మోడలింగ్ చేయడంలో నిమగ్నమైంది.
ఇకపోతే, మోడల్ సరస్వతీ మృతిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్‌లో కొట్టుమిట్టాడుతోందని కోల్‌కతా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆమె మాట్లాడిన ఫోన్ రికార్డులను సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న చోట ఎంలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణాలపై నిర్ధారణ కోసం పోలీసులు పోస్టు మార్టంకు తరలించారు.
ఇకపోతే, గత రెండు వారాలుగా టెలిపారాలో మోడల్స్ ఆత్మహత్యలు, మరణాలు కలకలం రేపుతున్నాయి.. మే 15న గార్ఫాలోని ఓ ఫ్లాట్ లో నటి పల్లవి మృతిచెందిన ఘటన మరువకముందే. మోడల్ సరస్వతీ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది.