గత కొద్ది రోజులుగా విశాఖ పోలీసులు గంజాయి స్మగ్లర్లపై కన్నేయడంతో.. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో గంజాయి ముఠా సభ్యులు పట్టుబడుతున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఇతర ప్రాంతాలకు నిత్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో పక్కా ప్లాన్ వేసి.. ప్రత్యేకంగా చెక్ పోస్టులు పెడుతూ.. గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. తాజాగా.. విశాఖ జిల్లా గొలుగొండ మండలం లింగంపేటలో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. రోజు వారీ విధుల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ లారీలో 1,200 కిలోల గంజాయిని గుర్తించారు. పోలీసులను చూసి.. లారీలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మరో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లారీతో పాటు.. గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. వీటి విలుల రూ.60 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Andhra Pradesh: Krishnadevipeta Police seized 1200 kgs of cannabis and arrested two persons from near Kedi Peta area of Visakhapatnam, yesterday. Further investigation underway. pic.twitter.com/9Wxhn1GjjT
— ANI (@ANI) July 7, 2020