Road Accident: మిర్యాలగూడలో ప్రైవేటు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. బాపట్ల వెళ్తుండగా..

|

Apr 09, 2022 | 9:27 AM

Road Accident: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ

Road Accident: మిర్యాలగూడలో ప్రైవేటు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. బాపట్ల వెళ్తుండగా..
Road Accident
Follow us on

Road Accident: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ బైపాస్ లోని హనుమాన్ పేట వద్ద అద్దంకి – నార్కెట్ పల్లి రహదారిపై జరిగింది. ఆరంజ్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి బాపట్లకు వెళ్తుండగా.. శనివారం ఉదయం (miryalaguda) అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 27 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ అతివేగం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతుందని.. పలువురికి తీవ్రగాయలయ్యాయని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిద్ర మత్తులో ఈ ప్రమాదం జరిగిందా..? లేక అతివేగమే కారణమా..? అనేది తెలియాల్సి ఉంది.

Also Read:

Robbery: ఏపీలో దొంగల బీభత్సం.. సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దోపిడీ.. సిగ్నల్ వైర్లు కట్ చేసి..

Hyderabad: భాగ్యనగరంలో దారుణం.. స్నేహితుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన దుర్మార్గులు..