Breaking: తెలంగాణలో కరోనాను జయించిన బాధితుడు..!

తెలంగాణలో కరోనా మహమ్మారిని జయించాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతడు కోలుకున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. గాంధీ హాస్పిటల్‌లో తాజాగా జరిపిన వైరాలజీ టెస్ట్‌లలో బాధితుడి షాంపిల్స్‌ నెగిటివ్‌గా తేలాయి.

Breaking: తెలంగాణలో కరోనాను జయించిన బాధితుడు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 10, 2020 | 8:54 PM

తెలంగాణలో కరోనా మహమ్మారిని జయించాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతడు కోలుకున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. గాంధీ హాస్పిటల్‌లో తాజాగా జరిపిన వైరాలజీ టెస్ట్‌లలో బాధితుడి షాంపిల్స్‌ నెగిటివ్‌గా తేలాయి. 48 గంటల తర్వాత మరోసారి పేషెంట్ రక్త నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్‌కి పంపనున్నారు వైద్యులు. ఒకవేళ అక్కడ కూడా షాంపిల్స్ నెగిటీవ్‌ అని ఫ్రూవ్ అయితే, వైరస్‌ బారి నుంచి బాధితుడు పూర్తిగా కోలుకున్నట్లే.

కాగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఈ 24 ఏళ్ల యువకుడు దుబాయ్‌ వెళ్లి కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. తిరుగు ప్రయాణంలో బెంగుళూరులో ఉంటున్న స్నేహితుల్ని కలిసి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బాధితుడి రక్త నమూనాలను పరిక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో తెలంగాణలో మొట్టమొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. బాధితుడిని గాంధీ ఐసోలేషన్‌ వార్డులో ఉంచి.. మెరుగైన చికిత్స అందిస్తూ నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఈ క్రమంలో బాధితుడు క్రమంగా కోలుకుంటూ వచ్చారు. తాజాగా జరిపిన టెస్ట్‌లలో వైరస్‌ నెగిటీవ్‌ అని తేలడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుణెలో టెస్ట్‌ చేసే నమునాలు కూడా నెగిటీవ్‌గా తెలితే, బాధితుడిని ఇంటికి పంపనున్నారు. అక్కడ కూడా మరో 14 రోజులు ఐసోలేషన్‌ వార్డులోనే గడపాల్సిందిగా సూచించనున్నారు వైద్యులు.

మరోవైపు కరోనాపై మంత్రి ఈటెల మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని.. 24 గంటలూ డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు. తెలంగాణలో ఒక్క కేసు లేకపోయినా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మరో రెండు థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు.