అంఫన్ ఎఫెక్ట్ః 76 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కరోనా

భార‌త్ లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. అన్నిఎవ్వ‌రినీ విడిచిపెట్ట‌కుండా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌ట్టి పీడిస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్)లో కరోనా అలజడి రేపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 76 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.

అంఫన్ ఎఫెక్ట్ః 76 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కరోనా
Follow us

|

Updated on: Jun 09, 2020 | 4:11 PM

భార‌త్ లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. అన్నిఎవ్వ‌రినీ విడిచిపెట్ట‌కుండా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌ట్టి పీడిస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్)లో కరోనా అలజడి రేపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 76 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టించిన అంఫన్ తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనడమే వారికి శాపమైంది. తుఫాన్ రెస్క్యూ చర్యల్లో పాల్గొన్నవారిలో మొత్తం 50 మంది సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఎన్డీఆర్‌ఎఫ్ కేంద్ర కార్యాలయంలో మరో 26 మందికి వైరస్ సోకింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ కరోనా బారినపడ్డ సిబ్బంది సంఖ్య 76కు చేరింది.

అంఫన్ తుఫాను సమయంలో ప‌శ్చిమ బెంగాల్‌లో సహాయ కార్యక్రమాలు అందించడానికి ఒడిశా నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున తరలివెళ్లారు. అక్కడ రెస్క్యూ ఆప‌రేష‌న్ అనంత‌రం ఒడిశా తిరిగివ‌చ్చారు. ఈ బృందంలో జూన్ 3న ఒక‌రికి క‌రోనా ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ప‌రీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వెంట‌నే అప్రమత్తమైన అధికారులు బృందంలోని 190 మందికి ప‌రీక్షలు నిర్వహించారు. దీంతో మరో 49 మందికి క‌రోనా సోకినట్లు నిర్ధారణ అయింది. బాధితులంతా క‌ట‌క్‌ ప్రాంతానికి చెందిన 3వ బెటాలియ‌న్‌కు చెందినవార‌ని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిలో కొంత మందిని కటక్‌లో మరి కొంత మందిని భువనేశ్వర్‌లో క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరికీ ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ్ ప్రధాన్ తెలిపారు.

USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం