Wrestling Player Commits Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ ఆటగాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినవారు కొందరైతే.. పనులు లేక కొందరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు. తాను ఎంతో ఇష్టంతో ఆడే ఆట కడుపు నిండా అన్నం పెట్టదనుకున్నాడో ఏమో.. ఓ క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.