ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా.. తీవ్ర‌ ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు..

| Edited By:

Jul 12, 2020 | 7:20 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ...

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా.. తీవ్ర‌ ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు..
Follow us on

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శ‌నివారం కొత్తగా 2,14,591 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఫ‌లితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,28,33,310కి చేరింది. అలాగే నిన్న ఒక్క రోజే 4,995 మంది మ‌ర‌ణించ‌డంతో.. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,67,034కి పెరిగింది.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చింది. దేశంలో నిన్న‌ రికార్డు స్థాయిలో 61,570 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 33,55,497కి చేరుకుంది. ఇక నిన్న కొత్త‌గా 731 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో, మొత్తం మృతుల సంఖ్య 1,37,402కి చేరింది. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. ఇక బ్రెజిల్, ఇట‌లీ, ఫ్రాన్స్, మెక్సికో, లండ‌న్ వంటి ప‌లు దేశాల్లో కూడా క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి.

అలాగే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 8,20,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,83,407 యాక్టివ్ కేసులు ఉండగా 5,15,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు తాజాగా 519 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 22,123కు చేరింది.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..