ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం: డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌..

| Edited By:

May 03, 2020 | 8:55 AM

ముఖ్యంగా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్‌పై ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 34,79,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం: డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌..
World Coronavirus
Follow us on

రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్‌పై ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 34,79,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,44,581కి చేరింది. ఇక శనివారం కొత్తగా 81,427 కేసులు నమోదవ్వగా.. కొత్తగా 5133 మంది మరణించారు. ఇక రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 11,080,23 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే దాదాపు 21,26,917 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 50,864 వేలకు పైగా పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 28,400 వేల కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈ దేశంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 11,59,430కి చేరింది. ఇక 67391 మంది కరోనాతో మరణించారు. ఇక రష్యాలో 124054 మందికి కరనా సోకగా.. మొత్తం మరణాల సంఖ్య 1222గా ఉంది. ఇక బ్రిటన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,260 ఉండగా.. 28,131 మంది కరోనాతో మరణించారు. అలాగే బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 96,559కి చేరింది. ఇక అక్కడ 6,750 మంది చనిపోయారు.

ఓవరాల్‌గా చూస్తే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ దేశాల్లో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకూ 37,776 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 1,223 మంది ప్రాణాలు కోల్పోగా, 8373 మంది డిశ్చార్జి అయ్యారు.

Read More: గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’