కరోనా ఎప్పటికీ మనల్ని విడిచిపోదు.. డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు..

|

May 14, 2020 | 9:52 AM

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. HIV వైరస్ లాగానే కరోనా కూడా ఎప్పటికీ మనల్ని విదిచిపోదని WHO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ హెచ్చరించారు. ఈ రెండు వైరస్‌లను ఒకే రకంగా పోల్చలేమని.. ప్రజలు వాస్తవం తెలుసుకోవడం చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ వైరస్ ఎప్పుడు, అదృశ్యమవుతుందో, ఎవరూ ఊహించలేరన్నారు. HIVకి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగోనలేకపోయామని.. అలాగే కరోనాకు కూడా సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు మనతోనే ఉంటుందని పరోక్షంగా అన్నారు. కానీ […]

కరోనా ఎప్పటికీ మనల్ని విడిచిపోదు.. డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు..
Follow us on

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. HIV వైరస్ లాగానే కరోనా కూడా ఎప్పటికీ మనల్ని విదిచిపోదని WHO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ హెచ్చరించారు. ఈ రెండు వైరస్‌లను ఒకే రకంగా పోల్చలేమని.. ప్రజలు వాస్తవం తెలుసుకోవడం చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ వైరస్ ఎప్పుడు, అదృశ్యమవుతుందో, ఎవరూ ఊహించలేరన్నారు.

HIVకి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగోనలేకపోయామని.. అలాగే కరోనాకు కూడా సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు మనతోనే ఉంటుందని పరోక్షంగా అన్నారు. కానీ వ్యాక్సిన్ తయారీ కోసం వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు…కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల వైరస్ ఇంకా విజృంభిస్తుందన్నారు. కాగా, ప్రస్తుతం కరోనాను అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాని వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించారు.

Read This: త్వరలోనే మాల్స్, సెలూన్స్ ఓపెన్.. అయితే.!