త్వరలోనే మాల్స్, సెలూన్స్ ఓపెన్.. అయితే.!

త్వరలోనే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే అందరూ కూడా కొన్ని గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని పరిమితులతో బార్బర్ షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. తొందరలోనే బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, మాల్స్ ఓపెన్ […]

త్వరలోనే మాల్స్, సెలూన్స్ ఓపెన్.. అయితే.!
Follow us

|

Updated on: May 14, 2020 | 8:55 AM

త్వరలోనే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే అందరూ కూడా కొన్ని గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని పరిమితులతో బార్బర్ షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. తొందరలోనే బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, మాల్స్ ఓపెన్ అవుతాయని.. కానీ కొన్ని గైడ్‌లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుందని తాజాగా మీడియా సమావేశంలో నితిన్ గడ్కరీ అన్నారు. మనం కరోనాతో జీవించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. మాస్క్‌ను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఇంట్లో లేదా ఆఫీసులోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతీసారి శానిటైజర్ ఉపయోగించడం వంటివి మన జీవితంలో భాగం అవ్వాలని తెలిపారు.

మరోవైపు లాక్ డౌన్ 4.0 గురించి ప్రస్తావించిన గడ్కరీ.. సరికొత్త రూల్స్‌తో.. డిఫరెంట్‌గా ఉండబోతుందని వివరించారు. మే 18లోపే లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రధాని నాలుగోదశ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రోజే మాల్స్, సెలూన్స్ విషయాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించడంతో వాటికీ ఈ లాక్ డౌన్‌లో మినహాయింపు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Read This: హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు సొంతూళ్లకు రావొచ్చు.. కానీ

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..