ఇలా అయితే ఎలా ? రైల్వే శాఖపై దీదీ ధ్వజం..

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 8:24 PM

రైల్వే మంత్రిత్వ శాఖపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ శాఖ మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి కరోనా వైరస్ ను వ్యాపింపజేస్తోందని ఆరోపించారు...

ఇలా అయితే ఎలా  ? రైల్వే శాఖపై దీదీ ధ్వజం..
Follow us on

రైల్వే మంత్రిత్వ శాఖపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ శాఖ మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి కరోనా వైరస్ ను వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. కరోనాను కట్టడి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. రైల్వే శాఖ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి ఎక్కువ రైళ్లను పంపుతోందని ఆమె విమర్శించారు. ఈ రెండు రాష్ట్రాలతోను రాజకీయ డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. దేశ వ్యాప్తంగా 225 రైళ్లు పశ్చిమ బెంగాల్ చేరుతుంటాయి. అయితే వీటిలో అత్యధికంగా అంటే 41 రైళ్లు మహారాష్ట్ర నుంచే బెంగాల్ చేరతాయి. ఆ రాష్ట్రం నుంచి వలస వఛ్చిన కార్మికులు చాలామంది మాల్దా, ముర్షీదాబాద్, దినాజ్ పూర్ వంటి ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు. వీరిలో చాలామంది కరోనా వైరస్ కు గురైనవారే. దీంతో ఈ రాష్ట్రంలో కరోనా జోరు పెరిగింది. అన్ని రైళ్ళూ తమ రాష్ట్రానికి చేరితే ఈ కేసులు ఇంకా పెరిగిపోతాయని బెంగాల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.