వారం రోజుల పాటు అక్కడ సకలం బంద్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

| Edited By:

Apr 15, 2020 | 5:31 PM

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బసు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు సకలం బంద్‌ చేయాలని.. ఇలా అయితే వైరస్‌ని మరింత కట్టడి చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు..

వారం రోజుల పాటు అక్కడ సకలం బంద్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
Follow us on

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతూనే ఉన్నాయి. పకడ్భందీగా లాక్‌‌డౌన్ అమలు పరుస్తున్నా కూడా చాపకింద నీరులాగా.. ఈ వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే.. తెలంగాణ రాష్ట్రంలో 52 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 644 అయ్యింది. అలాగే ఇప్పటివరకూ 18 మంది మృతి చెందారు. దీంతో.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బసు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు సకలం బంద్‌ చేయాలని.. ఇలా అయితేనే వైరస్‌ని మరింత కట్టడి చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. కాగా.. 29 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది వికారాబాద్ జిల్లా.

* మొబైల్ వ్యాన్ల ద్వారా.. ప్రతీ ఇంటికీ సరుకులు సరఫరా చేస్తాం
* రోడ్లమీదికి ఎవరూ రాకూడదు
* స్వీయ నియంత్రణలోనే పట్ణణ ప్రజలు ఉండాలి
* పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు.. రోడ్డుమీదకు వస్తే కేసులు తప్పవు
* బుధవారం నుండి కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాలు పూర్తిగా బంద్

Learn More: కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే

వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం