కోవిడ్ సోకిన గర్భిణీలకు ఆ ప్లేస్‌లో గాయాలు.. ముప్పే అంటోన్న నిపుణులు

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 10:13 AM

కరోనా వైరస్.. గర్భిణీలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కొంతమంది గర్భిణీలపై అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా.. పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ బారిన పడిన గర్బిణీల ప్లెసెంటాలో..

కోవిడ్ సోకిన గర్భిణీలకు ఆ ప్లేస్‌లో గాయాలు.. ముప్పే అంటోన్న నిపుణులు
Pregnant Woman
Follow us on

కరోనా వైరస్.. గర్భిణీలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కొంతమంది గర్భిణీలపై అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా.. పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ బారిన పడిన గర్బిణీల ప్లెసెంటా(పిండాన్ని మాతృకణాలంతో కలిపే ప్రత్యేక నిర్మాణం)లో గాయాలవుతున్నట్లు.. చికాగోలోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన ఇతర వ్యక్తుల కంటే గర్భిణీల పట్ల మరింత ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

దాదాపు 16 మంది కరోనా సోకిన గర్భిణీల్లో.. 15 మంది పండంటి బిడ్డలకు జన్మనివ్వగా.. వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధికులు తెలిపారు. ఒక మహిళకు మాత్రమే గర్భస్రావం జరిగిందని పేర్కొన్నారు. కాగా పిల్లలెవరూ వైరస్ బారిన పడలేదని స్పష్టం చేశారు.

అంతాబాగానే ఉన్నా.. ఈ ఫలితాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. మహిళల ప్లెసెంటాలో రక్తం గడ్డ కట్టడం, రక్త నాళాలు అసాధారణంగా కనిపిస్తున్నట్లు నివేదికలో వెల్లడైందన్నారు. కోవిడ్ సంక్రమించిన గర్భిణీలు.. ఇతర రోగుల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. సాధారణంగా పిండానికి ప్లెసెంటా వెంటిలేర్లుగా పని చేస్తుందని వాటికి గాయాలవడం ఆందోళన కలిగించే విషయమని వారు వెల్లడించారు.