మాస్క్ ధరించాలా ? ఎందుకూ ? ఖస్సుమన్న ట్రంప్

తన దేశ ఎకానమీయే తనకు ముఖ్యమని అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కరోనా మృతుల గురించి పట్టించుకోకుండా ఎకానమీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారెందుకని ప్రశ్నించగా .. అది నిజమేనని, తనకు దేశ ఆర్ధిక వ్యవస్థే ప్రధానమని నొక్కి చెప్పాడు. పైగా మాస్క్ ధరించేందుకు ససేమిరా అన్నాడు. ఆరిజోనాలోని ఫోనిక్స్ లో మాస్కుల తయారీ ఫ్యాక్టరీని విజిట్ చేసిన ఆయన.. కరోనా ముప్పు కన్నా ఆర్ధిక వ్యవస్థకు వాటిల్లే ముప్పు ఎక్కువని అభిప్రాయపడ్డాడు. ఇలా అయితే ఎక్కువమంది అమెరికన్లు మరణిస్తారు […]

మాస్క్ ధరించాలా ? ఎందుకూ ? ఖస్సుమన్న ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 06, 2020 | 3:00 PM

తన దేశ ఎకానమీయే తనకు ముఖ్యమని అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కరోనా మృతుల గురించి పట్టించుకోకుండా ఎకానమీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారెందుకని ప్రశ్నించగా .. అది నిజమేనని, తనకు దేశ ఆర్ధిక వ్యవస్థే ప్రధానమని నొక్కి చెప్పాడు. పైగా మాస్క్ ధరించేందుకు ససేమిరా అన్నాడు. ఆరిజోనాలోని ఫోనిక్స్ లో మాస్కుల తయారీ ఫ్యాక్టరీని విజిట్ చేసిన ఆయన.. కరోనా ముప్పు కన్నా ఆర్ధిక వ్యవస్థకు వాటిల్లే ముప్పు ఎక్కువని అభిప్రాయపడ్డాడు. ఇలా అయితే ఎక్కువమంది అమెరికన్లు మరణిస్తారు కదా అని మీడియా పేర్కొన్నప్పుడు.. అవును.. అలాగే జరుగుతుంది అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. లాక్ డౌన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎవరైనా ఒక అపార్ట్ మెంట్ లో గానీ, ఇంట్లో గానీ ఎంతకాలమని కూర్చుంటారని, వారిని ఎంతకాలం ‘లాక్’ చేస్తామని అన్నాడు. దీనివల్ల కొంతమందికి నష్టం.. (మరణాలు) కలగ వచ్ఛునని,  అది నిజమేనని అంగీకరించాడు.  కానీ.. మన దేశం కూడా ‘రీఓపెన్’ కావాలికదా అని వ్యాఖ్యానించాడు.

మాస్కులను భారీగా తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ సిబ్బందిని ట్రంప్ అభినందిస్తూ.. తాను చీర్ లీడర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. అసలు మాస్కుల అవసరం ఉందా అని ఒక దశలో ట్రంప్ ప్రశ్నించాడు. గత ఏప్రిల్ లో తను వివిధ దేశాల అధ్యక్షులను, ప్రధాన మంత్రులను, రాజులను గ్రీట్ చేసినప్పుడు వారికి మాస్కులు తగినవి కావని అభిప్రాయపడ్డానని ట్రంప్ పేర్కొన్నాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో