ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేనన్న మనస్తాపంతో.. విద్యార్థిని సూసైడ్

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 5:39 PM

కేరళ లోని మళప్పురంలో పదో తరగతి చదువుతున్న స్కూలు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు తాను నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుంది. ఆన్ లైన్ ద్వారా క్లాసులకు హాజరు కాలేకపోయానన్న..

ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేనన్న మనస్తాపంతో.. విద్యార్థిని సూసైడ్
Follow us on

కేరళ లోని మళప్పురంలో పదో తరగతి చదువుతున్న స్కూలు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు తాను నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుంది. ఆన్ లైన్ ద్వారా క్లాసులకు హాజరు కాలేకపోయానన్న దిగులుతో ఈ దారుణానికి ఒడిగట్టింది. తమ ఇంట్లో టీవీ ఉందని, కానీ పని చేయని దాన్ని మరమ్మతులకు ఇవ్వాలని తమ కూతురు కోరిందని ఆ బాలిక తండ్రి తెలిపాడు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆ టీవీని మరమ్మతు చేయించలేకపోయానని ఆయన చెప్పాడు. రోజువారీ శ్రామిక జీవి అయిన ఆ తండ్రి..  ఆ పాత టీవీని కనీసం రిపేర్ చేయించలేకపోయాడు.  తన కుమార్తె ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడంలేదని, మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి టీవీలో ఆన్ లైన్ తరగతులకు అటెండ్ కావాలని తను  కోరానని ఆయన చెప్పాడు. ఈ బాలిక తల్లి ఇటీవలే ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. పై చదువులు చదవలేనని తన కుమార్తె ఎంతో మధన పడేదని ఆ పేద తండ్రి తెలిపాడు. ఈ విషాద ఘటనపై కేరళ విద్యా శాఖ మంత్రి రవీంద్రనాథ్.. జిల్లా అధికారులనుంచి రిపోర్టు కోరారు.