UK Coronavirus : బ్రిటన్‌లో కఠినంగా లాక్‌డౌన్ కట్టుబాట్లు.. తగ్గిన కరోనా వైరస్‌ వ్యాప్తి

| Edited By: Pardhasaradhi Peri

Jan 23, 2021 | 7:07 AM

బ్రిటన్ కొత్త వైరస్ మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. దేశంలో ప్రస్తుతం మూడో దఫా లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తోంది. ఇకపై వైరస్‌ వ్యాప్తి..

UK Coronavirus : బ్రిటన్‌లో కఠినంగా లాక్‌డౌన్ కట్టుబాట్లు.. తగ్గిన కరోనా వైరస్‌ వ్యాప్తి
Follow us on

UK Coronavirus : బ్రిటన్ కొత్త వైరస్ మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. దేశంలో ప్రస్తుతం మూడో దఫా లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తోంది. ఇకపై వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉండకపోవచ్చని బ్రిటన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. రోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గే అవకాశాలున్నట్లుగా వారు అభిప్రయాపడుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అంచనా వేసే ‘ఆర్‌ రేట్‌’ ప్రస్తుతం 0.8 నుంచి 1 మధ్యలో ఉన్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఒకవేళ ఇది 1 కంటే ఎక్కువగా ఉన్నట్లయితేనే వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంటుందని తెలిపింది. అయితే, తాజా నివేదిక బ్రిటన్‌ ప్రభుత్వానికి ఊరట కలిగించే విషయమని అక్కడి నిపుణులు అంటున్నారు.

కోవిడ్ విస్తృతి ఎక్కువగా ఉండడంతో బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇదివరకే ప్రకటించారు. తాజాగా కొత్తరకం వైరస్‌ విజృంభణతో అక్కడ వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ ఎప్పటిలోగా ముగుస్తుందని చెప్పడం తొందరపాటే అవుతుందని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

స్కూళ్ళు, విద్యాసంస్థలు అన్నీ ఈ రెండు నెలలూ మూసి ఉంటాయన్నారు. ఒక్క ఇంగ్లండ్ లోనే సుమారు 44 మిలియన్ల మంది ఇక ఇళ్లకే పరిమితం కావలసి ఉంటుంది. మంగళవారం అర్ధ రాత్రి నుంచి స్కాట్ లాండ్ లో. బుధవారం నుంచి ఇతర రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.