జైళ్లో ఇద్దరికి పాజిటివ్.. ‘గ్రీన్ జోన్‌’లో కరోనా కలకలం..!

నిన్నటివరకు గ్రీన్ జోన్‌గా ఉన్న ప్రదేశంలో తాజాగా కరోనా కలకలం రేగింది. కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో ఇంతవరకు ఎలాంటి కేసులు లేకపోగా..

జైళ్లో ఇద్దరికి పాజిటివ్.. గ్రీన్ జోన్‌లో కరోనా కలకలం..!

Edited By:

Updated on: Apr 24, 2020 | 10:02 AM

నిన్నటివరకు గ్రీన్ జోన్‌గా ఉన్న ప్రదేశంలో తాజాగా కరోనా కలకలం రేగింది. కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో ఇంతవరకు ఎలాంటి కేసులు లేకపోగా.. తాజాగా రామనగర జైల్లో ఉన్న ఇద్దరికి కరోనా పాజిటివ్ సోకింది. అయితే ఇటీవల బెంగళూరులో హెల్త్ వర్కర్లపై దాడి కేసులో 126 మంది అనుమానితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని రామనగర సెంట్రల్‌ జైలుకు తరలించగా.. అందులో ఇద్దరికి కరోనా సోకింది. వీరిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని బెంగళూరులోని జైలుకు తరలించే యోచనలో అధికారులు ఉన్నట్లు తేలింది.

కాగా హెల్త్ వర్కర్లపై దాడి కేసులో అనుమానితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని జైలుకు తరలించే ముందు పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు గురువారం రాగా.. అందులో ఇద్దరికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వారితో కాంటాక్ట్ అయిన మిగిలిన వారిని గుర్తించి క్వారంటైన్‌ను పంపే పనిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read This Story Also: కరోనా ప్రపంచం అప్‌డేట్స్‌.. ఆ లిస్ట్‌లో చేరిన టర్కీ..!