కరోనాతో యుద్ధానికి ట్విట్టర్ సీఈవో భారీ విరాళం..! తన సంపదలో.. ఏకంగా…!

| Edited By:

Apr 08, 2020 | 4:43 PM

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న వైరస్. ఇది కంటికి కనిపంచకుండా.. ప్రపంచదేశాలన్నింటికి ఓ సవాల్‌గా మారింది. దీని దెబ్బకు ఇప్పటికే 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 13లక్షల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. ప్రాణనష్టం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారిని కట్టడిచేందసేందుకు.. అనేక దేశాలు నడుం బిగించాయి. ఇక పలు కార్పోరేట్ సంస్థలు.. పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు.. సోషల్ మీడియా దిగ్గజాలు ఈ […]

కరోనాతో యుద్ధానికి ట్విట్టర్ సీఈవో భారీ విరాళం..! తన సంపదలో.. ఏకంగా...!
Follow us on

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న వైరస్. ఇది కంటికి కనిపంచకుండా.. ప్రపంచదేశాలన్నింటికి ఓ సవాల్‌గా మారింది. దీని దెబ్బకు ఇప్పటికే 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 13లక్షల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. ప్రాణనష్టం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారిని కట్టడిచేందసేందుకు.. అనేక దేశాలు నడుం బిగించాయి. ఇక పలు కార్పోరేట్ సంస్థలు.. పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు.. సోషల్ మీడియా దిగ్గజాలు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. ఇతర సహాయక చర్యల కోసం భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ సీఈఓ జాక్ డార్సీ భారీ విరాళాన్ని ప్రకటించారు.

కరోనా కట్టడికి కోసం ఒక బిలియన్ డాలర్లను విరాళమిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.ఈ ఇచ్చే విరాళం.. తన సంపదలో దాదాపు 28 శాతానికి సమానమంటూ పేర్కొన్నారు. కరోనా నియంత్రణతో పాటు.. ఇతర సహాయక చర్యల కోసం.. ఈ నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. తన ఆధ్వర్యంలో ఉన్న చారిటీ సంస్థలైన స్టార్ట్ స్మాల్ ఎల్‌ఎల్‌సీ ద్వారా ఈ నిధులను కరోనా నియంత్రణకు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.