ట్యునీసియాలో లాక్ డౌన్.. ‘తాట తీస్తున్న’ పోలీస్ రోబో

| Edited By: Pardhasaradhi Peri

Apr 04, 2020 | 3:53 PM

ట్యునీసియా వాసుల్లో కొందరు ఈ పోలీస్ రోబోలను సాగతీస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం ఇది మరీ స్లోగా నడుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీటి పనితీరుపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకుఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వీటి వీడియోలను పోస్ట్ చేస్తోంది.

ట్యునీసియాలో లాక్ డౌన్.. తాట తీస్తున్న పోలీస్ రోబో
Follow us on

కరోనా మహమ్మారికి గురైన దేశాల్లో ట్యునీసియా కూడా ఒకటి.. ఫలితంగా అక్కడ కూడా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లలో ఉండకుండా రోడ్ల మీదికి వస్తే పోలీసులతో బాటు ఓ రోబో కూడా వారిని ఆపేస్తూ.. పెట్రోలింగ్ డ్యూటీ చేస్తోంది. ఎవరైనా వీధుల్లో కనబడడమే తరువాయి. అక్కడే వారిని ఆపేస్తోంది. వాళ్ళు తమ ఐడీ కార్డును, ఇతర పత్రాలను చూపిన తరువాతే అది రూటు మార్చుకుంటోంది.

నాలుగు చక్రాలు గల ఈ పోలీస్ రోబోలను ‘పీగార్డ్స్’ అని వ్యవహరిస్తున్నారు. వీటిలో థర్మల్ ఇమేజింగ్ కెమెరా, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సాధనాలు ఉంటాయి. ఇది రాడార్ లా పని చేసినప్పటికీ.. రేడియో తరంగాల బదులు లైట్ ను వినియోగించుకుంటుందట. ట్యునీసియాలో 14 మంది కరోనా బాధితులు మరణించారు. మాస్కులు తయారు చేసేందుకు సుమారు 150 మంది సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.  ప్రస్తుతం ఈ దేశంలో  436 మంది కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా ఇండియా వంటి దేశాల్లో మాదిరే మెడిసిన్స్ వంటి అత్యవసర సరకులను కొనేందుకు వెళ్లేవారిని పోలీసులు అనుమతిస్తున్నారు.