ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ..

| Edited By:

Jun 26, 2020 | 1:48 PM

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ ఛానల్ రానుందని అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులు కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది టీటీడీ యాజమాన్యం. అలాగే యాడ్ ఫ్రీ ఛానల్ నిర్వహణకు...

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ..
Follow us on

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ ఛానల్ రానుందని అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులు కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది టీటీడీ యాజమాన్యం. అలాగే యాడ్ ఫ్రీ ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని వెల్లడించింది. కాగా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలను భక్తులకు అందించడానికి తాము ప్రయత్నం చేస్తామని, లాభాపేక్ష లేకుండా పనిచేస్తామని యాజమాన్యం తెలిపింది. కాగా ఇప్పటికే 25 లక్షల రూపాయాలను ఛానల్‌కి విరాళంగా అందజేశారు భక్తులు.

కాగా మరోవైపు.. లాక్‌డౌన్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో.. కరోనా నిబంధనలను పాటిస్తూ జూన్ 11 నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ ఆలయ అధికారులు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

Read More: 

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు