THIRD-WAVE TENSION: ఇండియాకు థర్డ్ వేవ్ టెన్షన్.. సెకెండ్ వేవే ఇంత భయంకరమైతే మరి మూడోది?

|

May 08, 2021 | 3:26 PM

భారత్‌లో కరోనా ధర్ఢ్‌ వేవ్‌ వస్తుందా..? ఈ అంశంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్‌ తీవ్ర విధ్వంసం సృష్టిస్తొంది. ప్రతీ రోజుల నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు...

THIRD-WAVE TENSION: ఇండియాకు థర్డ్ వేవ్ టెన్షన్.. సెకెండ్ వేవే ఇంత భయంకరమైతే మరి మూడోది?
Corona 3rd Wave
Follow us on

THIRD-WAVE TENSION FOR INDIA: భారత్‌లో కరోనా ధర్ఢ్‌ వేవ్‌ వస్తుందా..? ఈ అంశంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్‌ (SECOND WAVE) తీవ్ర విధ్వంసం సృష్టిస్తొంది. ప్రతీ రోజుల నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నమోదు అవుతున్నాయి. వరుసగా రెండో రోజు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో దేశంలో ఆందోళన తీవ్రమవుతోంది. సంపూర్ణ లాక్ డౌన్‌ (TOTAL LOCK-DOWN)తోనే దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తుందని పలువురు సూచిస్తున్నారు. ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) మాత్రం సంపూర్ణ లాక్ డౌన్‌కు వ్యతిరేకమని జాతీయ మీడియా (NATIONAL MEDIA) చాటిచెబుతోంది. దానికి అనుగుణంగానే మోదీ ప్రభుత్వం (MODI GOVERNMENT) సంపూర్ణ లాక్ డౌన్ విషయంపై పెద్దగా కఠిన నిర్ణయాలేవీ తీసుకోవడం లేదు. రాష్ట్రాలకు మాత్రం కేంద్రం సూచనలు చేస్తూనే వుంది.

ఈ క్రమంలో సెకెండ్ వేవ్ మే మాసాంతానికి తగ్గుముఖం పట్టవచ్చని వైద్య వర్గాలు, శాస్త్రవేత్తలు (SCIENTISTS) అంఛనా వేస్తున్నారు. అయితే.. ఆ తర్వాత థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి వుందని చెబుతున్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలలో నాల్గవ వేవ్‌ (FOURTH WAVE) సైతం వచ్చిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో థర్ఢ్‌వేవ్‌ 2021 నవంబర్‌ చివర్లో లేదా డిసెంబర్‌లో రావచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో థర్డ్‌ వేవ్‌ తప్పదని కేంద్ర ప్రభుత్వం కూడా అంఛనా వేస్తోంది. ఈ థర్ఢ్‌ వేవ్‌ పిల్లలు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అయితే థర్డ్ వేవ్ వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్‌ (VACCINATION) ఒక్కటే సరైన మార్గంమంటున్నారు. సెకండ్‌ వేవ్‌ నియంత్రణకు ఇప్పటికే పలు రాష్ట్రాలలో అమలవుతున్నకఠిన ఆంక్షలు, లాక్‌ డౌన్‌ అమలవుతున్నారు. రానున్న రోజుల్లో మరి కొన్ని వేవ్‌లు తప్పవంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనా వేవ్ లను ఎదుర్కోవాలంటే అప్‌డేటెడ్ వ్యాక్సిన్‌‌ (UPDATED VACCINE)లే శరణ్యం అంటూ సూచనలు చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ థర్డ్ వేవ్‌ తప్పనిసరి అంటున్నారు విశ్లేషకులు. కరోనా వేవ్‌‌ల నుంచి బయట పడాలంటే మన జీవన విధానంలో మార్పులు రావాలంటున్నారు.

వైరస్‌లలో తేడాలు…

2020లో కరోనా వైరస్ (CORONA VIRUS) ప్రాణాంతకంగా మారలేదు. కానీ 2021లో పెరిగిన కేసుల వేగం, పిల్లలు, యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. జరుపుతున్న పరీక్షల్లో పాజిటివ్ (POSITIVE) శాతం కూడా బాగా పెరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య రుజువు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వైరస్‌లో మ్యుటేషన్ (MUTATION) జరిగినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా వుంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకోని జనాభాపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సమాచారం. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. పిల్లల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం ఎలా వుంటుందనే అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. వాక్సిన్‌ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా వుంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత శరీరంలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు (ANTI BODIES) కేవలం 40 శాతం మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని తెలుస్తోంది. కానీ రెండు డోసులు (SECOND DOSES) వేసుకున్నాకే పూర్తి రక్షణ ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరిలో మొదటి డోసు తీసుకున్నాక కూడా వైరస్ సోకుతుంది. దానికి కారణం వారిలో కనిపిస్తున్న నాన్ పల్మనరీ సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్ (PULMANARY SYSTEMIC INFLAMATION) కారణమని శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. అంటే మొదటి డోసు తీసుకున్న వారికి కరోనా సోకినా కూడా వారి ఊపిరి తిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ వారిలో జ్వరం మాత్రం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఒకసారి కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో మళ్ళీ 102 రోజుల వ్యవధి తర్వాత వైరస్ సోకితే, దానిని రీ-ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారని డబ్ల్యూహెచ్‌వో (WHO) తెలిపింది. ఇలాంటి రోగుల్లో ఏ రకం వైరస్‌ వల్ల కొత్త ఇన్ఫెక్షన్ (INFECTION) సోకిందో ప్రాధమికంగా నిర్ధారించుకోవాల్సి వుంటుంది. బ్రిటన్ (BRITAIN) నుంచి వచ్చిన యుకే రకం మ్యూటెంట్ వైరస్ (UK VARIANT MUTANT VIRUS) పిల్లలు, యువతలో ఎక్కువగా వ్యాపిస్తోంది. బ్రెజిల్ (BRAZIL) వైరస్ అయితే మరణించే ముప్పు ఎక్కువగా వుంటుందని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికా (SOUTH AFRICA) రకం వైరస్ సోకితే లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడుతున్నాయి. వీరిలో క్రిటికల్ సిచ్యుయేషన్ (CRITICAL SITUATION) దశకు చేరినపుడే లక్షణాలు బహిర్గతమవుతున్నాయి. దాంతో ప్రాణాపాయం ఎక్కువవుతోంది. సాధారణంగా వైరస్ మ్యుటేట్ జరుగుతున్నప్పడు.. వ్యాక్సిన్లను తట్టుకుని నిలబడగలిగే శక్తి వాటికి లభిస్తుంది. దాంతో పరీక్షల్లో బయటపడదు. ఔషధాలకు లొంగని శక్తి సంతరించుకుంటుందంటున్న నిపుణులు. ఇది ప్రమాదకరమని అందుకే థర్డ్ వేవ్ వస్తే ప్రాణాలకు ప్రమాదం పొంచి వుందని హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ రాకుండా ప్రజలందరు అప్రమత్తంగా వుండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.