భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

|

May 16, 2020 | 3:41 PM

భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తనకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనే క్రమంలో భారత్, అమెరికా దేశాలు కలిసి పని చేస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇండియాలో ప్రస్తుతం కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నమోదైన లెక్కల ప్రకారం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 85 వేలు దాటింది. “భారతదేశంలోని మా స్నేహితులకు అమెరికా, వెంటిలేటర్లను విరాళంగా […]

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..
Follow us on

భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తనకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనే క్రమంలో భారత్, అమెరికా దేశాలు కలిసి పని చేస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇండియాలో ప్రస్తుతం కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నమోదైన లెక్కల ప్రకారం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 85 వేలు దాటింది.

“భారతదేశంలోని మా స్నేహితులకు అమెరికా, వెంటిలేటర్లను విరాళంగా ఇస్తుందని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది. కరోనాను అరికట్టడంలో భాగంగా మేము, మోదీ కలిసి పని చేస్తున్నాం. ఇద్దరం కలిసి అజ్ఞాత శత్రువు అయిన కరోనాను ఓడిస్తాం” అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ట్రంప్ విజ్ఞప్తి మేరకు మోదీ ప్రభుత్వం కిందటి నెల 50 మిలియన్ హైడ్రాక్సీక్ల్రోక్విన్ టాబ్లెట్స్ అమెరికాకు పంపించిన సంగతి విదితమే.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..

కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!