తిరుపతిలో కరోనా కల్లోలం..ఒకే ఇంట్లో 10 మందికి పాజిటివ్

|

Jul 04, 2020 | 12:11 PM

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వెంటాడుతూనే ఉంది. కోవిడ్ కోరల్లో చిక్కుకుని రాష్ట్రం విలవిల్లాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 16,934కు చేరింది. రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 206కు పెరిగింది. అటు, ఆధ్యాత్మీక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలోనూ కరోనా కలకలం రేపుతోంది.

తిరుపతిలో కరోనా కల్లోలం..ఒకే ఇంట్లో 10 మందికి పాజిటివ్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వెంటాడుతూనే ఉంది. కోవిడ్ కోరల్లో చిక్కుకుని రాష్ట్రం విలవిల్లాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 16,934కు చేరింది. రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 206కు పెరిగింది. అటు, ఆధ్యాత్మీక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలోనూ కరోనా కలకలం రేపుతోంది.

చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వరుసగా 40 కేసులకు తగ్గకుండా పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1200కు చేరువగా పాజిటివ్ కేసులు నమోదుకావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒక్క చిత్తూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1183కు చేరింది.

ఇదిలా ఉంటే, జిల్లాలోని మదనపల్లెలో ఒకే కుటుంబంలో 10 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇద్దరు 10ఏళ్ల లోపు చిన్నారులు కరూడా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా వీరికి వైరస్ సంక్రమించినట్లుగా అధికారులు గుర్తించారు. వీరితో సన్నిహితంగా ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు తిరుపతిలోని స్విమ్స్, రుయాతో పాటు ఇంకా వివిధ ప్రాంతాల్లోని ల్యాబుల్లో నమూనా పరీక్షలు చేస్తున్నారు. ఇక టీటీడీకి చెందిన శ్రీనివాస వసతి సముదాయంలోనూ శుక్రవారం నుంచి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలో కేసులు భారీగా పెరిగిపోతుండటంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను ఎప్పటికప్పుడు గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.