
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 37 వేల మార్క్ దాటి.. నలభై వేలకు చేరువయ్యాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ఇక మంగళవారం నాడు కరోనా నుంచి కోలుకుని 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 24,840 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే కరోనా బారినపడి మంగళవారం నాడు 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 375 మంది మరణించారు.
కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 240 కేసులు, మేడ్చల్ జిల్లాలో 97 కేసులు సంగారెడ్డిలో 61కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో 8, కామారెడ్డి 19, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 3, కరీంనగర్ 29, జగిత్యాల 2, మెదక్ 24, మహబూబ్ నగర్ 7, మంచిర్యాల 12, భద్రాద్రి కొత్తగూడెం 8, జయశంకర్ భూపాల్లి 12, నల్గొండ 38, సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 7, ఆసీఫాబాద్ 5, వికారాబాద్ 21, నాగర్ కర్నూల్ 1, జనగాం 4, నిజామాబాద్ 17, ములుగు 6, వనపర్తి 5, సిద్దిపేట 4, సూర్యాపేట 15, గద్వాల జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.