
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురవారం నాడు కొత్తగా మరో 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంక్య 4320కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గురువారం నమోదైన కేసుల్లో.. మేడ్చల్ జిల్లాలో 10, రంగారెడ్డి 7, వరంగల్ అర్బన్2, మహబూబ్ నగర్ 3, ఆసిఫాబాద్ 2, సిద్దిపేట 2, కరీంనగర్ 3, ములుగు 1, కామారెడ్డి 1, వరంగల్ రూరల్ 1, సిరిసిల్ల 1, కేసు నమోదైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2162 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. కరోనా నుంచి కోలుకుని 1993 మంది ఆస్ప్రత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 165 మంది మరణించినట్లు తెలిపారు.