Telangana High Court: రోజుకి లక్ష RT PCR పరీక్షలు చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..

|

Jan 17, 2022 | 12:57 PM

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య..

Telangana High Court: రోజుకి లక్ష RT PCR పరీక్షలు చేయాలి..  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
High Court
Follow us on

Telangana High Court – Covid Cases: తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని పేర్కొంది హైకోర్టు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశంచింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని.. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న సూచించింది హైకోర్టు. కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించారు.  పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ.. ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్లు తెలిపింది. కొవిడ్‌ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్‌ విచారణలు జరపనున్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసిన హైకోర్టు.

ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్‌ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ రిపోర్టులో కోర్టుకు నివేదించారు.

ఇవి కూడా చదవండి: Pandit Birju Maharaj: ఆ సవ్వడి ఇక వినిపించదు.. ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్‌‌కు గుండెపోటు

Glowing Skin : చలికాలంలో మెరిసే చర్మం కోసం.. ఈ వింటర్ సూపర్ ఫుడ్స్.. మీ డైట్‌లో చేర్చుకోండి