Telangana corona: కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతిరోజూ 2వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండడం పరిస్థితి తీవ్రతను తెలయజేస్తున్నాయి. ఇక మరణాలు కూడా సంభవిస్తుండడం మళ్లీ కరోనా పాత రోజులను గుర్తు చేస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,478 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది… ఐదుగురు మరణించారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా 402 కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 208, నిజామాబాద్‌లో 176, రంగారెడ్డిలో 162 కేసులు నమోదు కాగా అత్యల్పంగా ములుగులో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గత 24గంటల్లో మహమ్మారి బారినుంచి 363 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,182కి చేరుకున్నాయి. ఇప్పటివరకు కరోనాను జయించలేక మొత్తం 1,764 మంది మృత్యువాత పడ్డారు.
Also Read: Corona Cases India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!
కరోనా కారణంగా పాఠాలు మిస్ అవుతున్న విద్యార్థులు.. పిల్లల కోసం ఓ ప్రభుత్వ టీచర్ వినూత్న ప్రయత్నం
Carona Virus : మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా..! అయితే ఇంటి వద్దే ఇలా చికిత్స తీసుకోండి..?