టాటా సన్స్ విరాళం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఎందుకంటే..?

| Edited By:

Mar 28, 2020 | 9:24 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో.. కరోనాపై యుద్ధానికి అంతా ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రతన్ టాటా.. తన టాటా ట్రస్ట్ తరఫున రూ.500 కోట్లు ప్రకటించారు. అయితే రతన్ టాటా ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించిన కాసేపటికే.. టాటా సన్స్.. ఇంతకు రెండంతల విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా.. టాటా సన్స్‌ తరఫున.. కరోనా మహమ్మారిపై సమరానికి రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో మొత్తంగా […]

టాటా సన్స్ విరాళం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఎందుకంటే..?
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో.. కరోనాపై యుద్ధానికి అంతా ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రతన్ టాటా.. తన టాటా ట్రస్ట్ తరఫున రూ.500 కోట్లు ప్రకటించారు. అయితే రతన్ టాటా ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించిన కాసేపటికే.. టాటా సన్స్.. ఇంతకు రెండంతల విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా.. టాటా సన్స్‌ తరఫున.. కరోనా మహమ్మారిపై సమరానికి రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో మొత్తంగా టాటా గ్రూప్‌ కరోనాపై యుద్ధానికి రూ.1500 కోట్లు ప్రకటించినట్లైంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పెద్ద సవాల్‌గా మారిందని.. వీలైనంత త్వరగా ఈ కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలని.. ప్రజలంతా లాక్‌డౌన్ విధిగా పాటిస్తూ.. ఇళ్లలోనే ఉండాలని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా అన్నారు.