సూర్యాపేట జిల్లాలో క‌రోనా యాక్షన్‌ప్లాన్‌

|

Apr 22, 2020 | 12:22 PM

కరోనా వైరస్‌ దెబ్బకు సూర్యాపేట విలవిలలాడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

సూర్యాపేట జిల్లాలో క‌రోనా యాక్షన్‌ప్లాన్‌
Follow us on
కరోనా వైరస్‌ దెబ్బకు సూర్యాపేట విలవిలలాడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 93కు చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 16 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు అధికారులు. ఆయా ప్రాంతాలలో ఆంక్షలను మరింత కఠినతరం చేశారు పోలీసులు. తెలంగాణ జిల్లాలలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటిస్తున్నారు. సూర్యాపేట, వికారాబాద్‌, గద్వాల జిల్లాలలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో డీజీపీతో కలిసి చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ కూడా పర్యటిస్తున్నారు.
వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తుండటంతో తెలంగాణలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం మునిసిపాలిటి స్పెషల్ ఆఫీసర్‌గా వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు.  స్పెషల్‌ కలెక్టర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అధికారాలు అప్పగించారు. ఇక సూర్యాపేట డిఎస్పీ నాగేశ్వరరావును బదిలీ చేశారు. ఆయన స్థానంలో మోహన్‌కుమార్‌ను నియమించారు. జిల్లాలో ఒక్కసారిగా వైరస్‌ విజృంభించడంతో డీఎంహెచ్‌వోపై వేటు పడింది. డాక్టర్‌ నిరంజన్‌ను తప్పించి డాక్టర్‌ సాంబశివరావుకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగారు.