కరోనా భయంతో చిలుకూరు టెంపుల్‌లో ప్రత్యేక పూజలు.

కరోనా వైరస్‌ భారత్‌లో పాగా వేసేసింది. ఇటాలియన్‌ టూరిస్టుల ద్వారా దేశంలోకి అడుగుపెట్టేసింది. ఇటాలియన్లు పర్యటించిన ప్రాంతాల్లో పలువురికి వైరస్‌ సోకింది. కోవిడ్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు. ఎప్పడు ఎవరి నుంచి కరోనా సోకుతుందేమోనని వణికిపోతున్నారు. కరోనా భయంతో చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌-19 నుంచి రక్షించాలంటూ ప్రార్థనలు చేశారు. ప్రపంచాన్ని చుట్టేసిన వైరస్‌ నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ పూజలు […]

కరోనా భయంతో చిలుకూరు  టెంపుల్‌లో ప్రత్యేక పూజలు.

Updated on: Mar 05, 2020 | 9:52 AM

కరోనా వైరస్‌ భారత్‌లో పాగా వేసేసింది. ఇటాలియన్‌ టూరిస్టుల ద్వారా దేశంలోకి అడుగుపెట్టేసింది. ఇటాలియన్లు పర్యటించిన ప్రాంతాల్లో పలువురికి వైరస్‌ సోకింది. కోవిడ్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు. ఎప్పడు ఎవరి నుంచి కరోనా సోకుతుందేమోనని వణికిపోతున్నారు.

కరోనా భయంతో చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌-19 నుంచి రక్షించాలంటూ ప్రార్థనలు చేశారు. ప్రపంచాన్ని చుట్టేసిన వైరస్‌ నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆలయ పూజారులు.