అందుకే… వేడుకలు వద్దు-బాలు

|

Jun 04, 2020 | 5:40 PM

ప్రాణమిచ్చే కోట్లాదిమంది సంగీతాభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఉన్నారు.

అందుకే... వేడుకలు వద్దు-బాలు
Follow us on

జూన్‌ 4.. గాన గంధర్వుడు.. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్‌ ఎస్‌పీ బాలసుబ్రమణ్యం 74వ పుట్టినరోజు. 11 భార‌తీయ భాష‌ల్లో పాట‌లు పాడిన ఘ‌న‌త మన ఎస్‌పీది. ఇప్ప‌టికి 40వేలకు పైగా పాట‌లు పాడి రికార్డు సృష్టించారు బాలు. 1966 డిసెంబ‌ర్ 15న తొలి పాట ఆల‌పించి నేప‌థ్య గాయ‌కుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. న‌టుడు, నిర్మాత ప‌ద్మ‌నాభం నిర్మించిన “శ్రీ‌శ్రీ‌శ్రీ మ‌ర్యాద రామ‌న్న‌” చిత్రంలోని “ఏమి ఈ వింత మోహం…” పాట‌ను పి.సుశీల‌, పి.బి.శ్రీ‌నివాస్‌, కె.ర‌ఘురామ‌య్య‌తో క‌లిసి పాడారు బాలు.

ఆయన పాటంటే ప్రాణమిచ్చే కోట్లాదిమంది సంగీతాభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ నటులు తమ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిలో కండలవీరుడు సల్మాన్, చిరంజీవితోపాటు చాలా మంది ఉన్నారు.

కానీ.. బాలు మాత్రం.. వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ ఒక వీడియో సందేశమిచ్చారు. ప్రపంచమంతా కోవిడ్ బెంగతో బాధపెడుతుంటే… మనం పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం సమంజసం కాదని.., వీలైతే బాధితులకు సాయం చెయ్యండని కోరారు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం.