పాక్‌ దక్షిణ సింధ్ ప్రావిన్స్ గవర్నర్‌ను కాటేసిన కరోనా..!

పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో పాటు.. వందల మరణాలు సంభవించాయి. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. ఈ మహమ్మారి అక్కడ కూడా ప్రజల్నే కాదు.. అధికారులను.. రాజకీయ నాయకులన కూడా వదలట్లేదు. తాజాగా పాకిస్థాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్ గవర్నర్.. ఇమ్రాన్ ఇస్మాయిల్‌ను కరోనా కాటేసింది. కరోనా పరీక్షల్లో ఇతడికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఇతడిని క్వారంటైన్‌కు తరలించారు. […]

పాక్‌ దక్షిణ సింధ్ ప్రావిన్స్ గవర్నర్‌ను కాటేసిన కరోనా..!

Edited By:

Updated on: Apr 28, 2020 | 9:43 PM

పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో పాటు.. వందల మరణాలు సంభవించాయి. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. ఈ మహమ్మారి అక్కడ కూడా ప్రజల్నే కాదు.. అధికారులను.. రాజకీయ నాయకులన కూడా వదలట్లేదు. తాజాగా పాకిస్థాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్ గవర్నర్.. ఇమ్రాన్ ఇస్మాయిల్‌ను కరోనా కాటేసింది. కరోనా పరీక్షల్లో ఇతడికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఇతడిని క్వారంటైన్‌కు తరలించారు. ఇమ్రాన్
ఇస్మాయిల్‌ పాక్ ప్రధానికి సన్నిహితుడు. గవర్నర్‌ హోదాలో ఉన్న ఇతడికి కరోనా సోకడంతో.. ఆయన కుటుంబ సభ్యులందర్నీ క్వారంటైన్‌కు తరలించి.. కరోనా పరీక్షలు చేస్తున్నారు.