‘కరోనా వైరస్ టెస్టులపై ‘దూకుడొద్దు’…ట్రంప్ వార్నింగ్

| Edited By: Pardhasaradhi Peri

Jun 22, 2020 | 12:16 PM

కరోనా వైరస్ టెస్టులను కాస్త తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెల్త్ వర్కర్లను హెచ్చరించారు. టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. మరిన్ని కేసులు బయటపడుతున్నాయన్నారు. ఓక్లహామాలో జరిగిన ఓ కార్యక్రమంలో..

కరోనా వైరస్ టెస్టులపై దూకుడొద్దు...ట్రంప్ వార్నింగ్
Follow us on

కరోనా వైరస్ టెస్టులను కాస్త తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెల్త్ వర్కర్లను హెచ్చరించారు. టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. మరిన్ని కేసులు బయటపడుతున్నాయన్నారు. ఓక్లహామాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అయన.. ‘టెస్టింగ్ అన్నది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది’ అని అభివర్ణించారు. మీరు టెస్టులు చేస్తున్న కొద్దీ మరింత మంది రోగులను, కేసులను చూడడం ఖాయం  అని వ్యాఖ్యానించారు. అందుకే కాస్త జోరు తగ్గించండి అన్నారు. ‘స్లో ది టెస్టింగ్ డౌన్.. దే టెస్ట్ అండ్ టెస్ట్’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే ఈ సిటీలో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజల్లో చాలామంది.. తన కామెంట్లకు హర్షామోదం తెలపడం చూసి. ‘జోష్’ ఎక్కువై ఆయన ఈ మాటలన్నారా. లేక సీరియస్ గానా అన్నది తెలియడంలేదు. నిజానికి అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దేశంలో అనేక రాష్ట్రాల్లో డయాగ్నస్టిక్ టెస్టులను ఎక్కువగా ఎందుకు చేస్తున్నారని ఆయా రాష్ట్రాల గవర్నర్లను ఆయన ఆమధ్య ప్రశ్నించారు. దేశంలో సుమారు 30 లక్షల వరకు కరోనా కేసుల టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో… ప్రపంచ దేశాల్లో టెస్టులు ఎక్కువగా చేస్తున్న దేశాల్లో యుఎస్ 26 వ స్థానంలో చేరింది.