దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు నిత్యం కరోనా బారిన పడుతున్నారన్న వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటికే ఈ వైరస్ సోకి పలువురు మరణించిన సంగతి కూడా తెలిసిందే. సామాన్యులతో పాటు వారికి కూడా కోవిడ్ సోకుతూండటంతో.. భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం కూడా కరోనా బారిన పడి, చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకోవాలి దేశ వ్యాప్తంగా పలువురు సినీ సెలబ్రిటీలు కోరుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక రీసెంట్‌గా టాలీవుడ్ పాపులర్ సింగర్స్ సునీత, మాళవికలు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. సునీత కూడా కరోనా నుంచి కోలుకోగా మాళవిక ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంది. అయితే తనతో పాటు తన రెండేళ్ల కూతురికి, తల్లిదండ్రులకి కూడా కరోనా సోకినట్టు మాళవిక పేర్కొంది.
”నాకు కొంత జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే మా ఇంట్లో వారికి కూడా టెస్టులు చేయగా, మా పాపకి, తల్లిదండ్రులకి కూడా కోవిడ్ సోకినట్టు నిర్థారణ అయింది. ప్రస్తుతం మేము హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాం. నా భర్త చైతన్య మాకు చాలా సపోర్ట్”గా నిలిచారని పేర్కొంది సింగర్ మాళవిక.
Read More:
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి.. ప్రధాని మోదీ నివాళి
వచ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్’