రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన షూటింగ్స్..

కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా సినీ, టెలివిజన్ షూటింగ్స్ నిలిచిపోయాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో కాస్త ఊరట లభించింది. సగం పూర్తైన సినిమాలు, అర్థాంతరంగా ఆగిపోయిన సీరియల్స్ షూటింగ్స్...

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన షూటింగ్స్..

Edited By:

Updated on: Jun 12, 2020 | 6:21 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా సినీ, టెలివిజన్ షూటింగ్స్ నిలిచిపోయాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో కాస్త ఊరట లభించింది. సగం పూర్తైన సినిమాలు, అర్థాంతరంగా ఆగిపోయిన సీరియల్స్ షూటింగ్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ సందడి మొదలైంది. ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్ చిత్రీకరణను పున:ప్రారంభించారు. అలాగే పరిమిత సిబ్బందితో.. ప్రభుత్వం ఇచ్చిన అన్ని సూచనలూ పాటిస్తూ ఓ ఇంట్లో చిత్రీకరణ చేశారు.

సీరియల్ షూటింగ్స్‌ చిత్రీకరణలో పాటిస్తున్న జాగ్రత్తలు:

– చిత్రీకరణ జరిపే లొకేషన్ బయట, లోపల పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు
– సెట్‌లోకి వచ్చే సిబ్బంది, నటీనటులకు థర్మల్ స్క్రీనింగ్
– శరీర ఉష్ణోగ్రతల నమోదుతో పాటు తప్పనిసరిగా శానిటైజర్ రాసుకుంటూ, మాస్క్‌లు ధరిస్తున్నారు
– నటీనటులకు మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు
– బ్రేక్ సమయంలోనే కాకుండా చిత్రీకరణ సమయంలో కూడా భౌతిక దూరం
– షూటింగ్‌కు ఉపయోగించే కెమెరాలు, ఇతరత్రా వస్తువులు కూడా శానిటైజ్
– నటీనటులతో పాటు సిబ్బంది కూడా మాస్క్‌లు, హ్యాండ్ గ్లౌజ్‌లు ధరిస్తున్నారు

Read More:

అధికారులు, ఉద్యోగులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

నోకియా ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!