గుంపులుగా గబ్బిలాలు మృతి.. భయపడుతున్న ప్రజలు..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ గుంపులు గుంపులుగా గబ్బిలాలు మృత్యువాతపడటం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్ శివారు గ్రామమైన మెహ్రోలీలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. దీనితో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వీటి నుంచే వ్యాపించిందని వారు అనుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యే వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని అందించారు. […]

గుంపులుగా గబ్బిలాలు మృతి.. భయపడుతున్న ప్రజలు..

Updated on: May 08, 2020 | 9:40 AM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ గుంపులు గుంపులుగా గబ్బిలాలు మృత్యువాతపడటం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్ శివారు గ్రామమైన మెహ్రోలీలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. దీనితో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వీటి నుంచే వ్యాపించిందని వారు అనుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యే వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని అందించారు.

ఇక సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గబ్బిలాల నమూనాలను బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కి పంపించారు. వాటి మీద ఐవీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి కరెంట్ షాక్ తగలడం వల్లే గబ్బిలాలు మరణించాయని ధృవీకరించారు. దీనిపై అటవీ శాఖ అధికారి అదితి శర్మ మాట్లాడుతూ.. మొదటిగా పండ్ల తోటలలో వెదజల్లిన రసాయనాల వల్ల గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. కానీ ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం ఆయన మాటలను ఖండిస్తూ గబ్బిలాల మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని అంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ కరెంట్ షాక్ కారణంగానే అవి చనిపోతే.. అక్కడ ఉన్న మిగతా జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలనీ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read This: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!