
లాక్‌డైన్‌తో చిత్రపరిశ్రమ మొత్తం ఇంటికే పరమితమైపోయింది. సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అంతా ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంత సమయాన్ని సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ కోసం కేటాయిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కరోనాపై చిన్న కామెడీ స్కిట్ చేసి నవ్వులు పూయించారు. తను ఉంటున్న గ్రేటర్ కమ్యూనిటీవాసులతో కలిసి సరదాగా ఫన్ షో చేశారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
1980లో బాలీవుడ్‌లోకి శక్తి కపూర్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 700 చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్‌తోపాటు కామెడీ క్యారెక్టర్లతో తనదైన ముద్రను వేసుకున్నారు. అస్రానీ, ఖాదర్ ఖాన్‌తో కలిసి 100 కి పైగా చిత్రాలలో హాస్య భరితమైన పాత్రలను పోషించారు.