బయటకు రావాలంటే భయంగా ఉంది: వివి వినాయక్

కరోనా వైరస్ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బయటకు రావడం చాలా భయంగా ఉందని ఆందోలన వ్యక్తం చేశారు సంచలన చిత్రాల దర్శకుడు వి.వి వినాయక్. జనాల మధ్యకు రావాలంటే కష్టతరంగా మారిందన్నారు వినాయక్. అయితే నిరుపేదల అవసరాలను తీర్చేందుకు...

బయటకు రావాలంటే భయంగా ఉంది: వివి వినాయక్

Edited By:

Updated on: Jun 28, 2020 | 6:23 PM

కరోనా వైరస్ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బయటకు రావడం చాలా భయంగా ఉందని ఆందోలన వ్యక్తం చేశారు సంచలన చిత్రాల దర్శకుడు వి.వి వినాయక్. జనాల మధ్యకు రావాలంటే కష్టతరంగా మారిందన్నారు వినాయక్. అయితే.. నిరుపేదల అవసరాలను తీర్చేందుకు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనక తప్పడం లేదని తెలిపారు. మనం సైతం, వసుధ పౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి వినాయక్‌తో పాటు ప్రముఖ కథానాయిక పూనమ్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరై సుమారు 200 మంది సినీ కార్మికులు, నిరుపేదలకు 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వసుధ పౌండేషన్ తరపున మంతెన వెంకటరామరాజు నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల వినాయక్, పూనమ్ కౌర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణం పట్ల బాధ్యత చాటుకున్నారు.

Read More:

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..