గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌ 12న తొలి వ్యాక్సిన్..!

| Edited By:

Aug 08, 2020 | 5:09 AM

అనుకున్నట్లుగానే రష్యా తన తొలి కరోనా వ్యాక్సిన్‌ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 12వ తేదీన వ్యాక్సిన్‌ విడుదల చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒలేగా గ్రిడ్నెవ్‌ వెల్లడించారు. శుక్రవారం నాడు..

గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌ 12న తొలి వ్యాక్సిన్..!
Follow us on

అనుకున్నట్లుగానే రష్యా తన తొలి కరోనా వ్యాక్సిన్‌ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 12వ తేదీన వ్యాక్సిన్‌ విడుదల చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒలేగా గ్రిడ్నెవ్‌ వెల్లడించారు. శుక్రవారం నాడు ఉఫా నగరంలో క్యాన్సర్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన సమయంలో.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.వ్యాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్‌, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని పేర్కొన్నారు. ‘గమలేయ ఇన్స్‌స్టిట్యూట్‌ డెవలప్‌ చేసిన వ్యాక్సిన్‌ ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్‌లో ఉంది. ఇది ఎంతో ముఖ్యమైందని.. వైరస్ బారినపడిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగితే.. వ్యాక్సిన్‌ సురక్షితమని అర్ధం చేసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాక్సిన్‌ను తొలిదశలో.. వైద్యాధికారులకు, సీనియర్‌ సిటిజన్లకు వేస్తామని.. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కాగా, ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ జూన్ 18వ తేదీన ప్రారంభమయ్యాయి.

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే