కరోనా.. ఇండియాలో యాక్టివ్ కేసులను మించిపోయిన రీకవరీ కేసులు

ఇండియాలో వరుసగా ఎనిమిదో రోజు కూడా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఒక్క రోజులో 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి 2,76,583 కేసులు నమోదు కాగా..

కరోనా..  ఇండియాలో  యాక్టివ్ కేసులను మించిపోయిన రీకవరీ కేసులు

Edited By:

Updated on: Jun 10, 2020 | 11:38 AM

ఇండియాలో వరుసగా ఎనిమిదో రోజు కూడా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఒక్క రోజులో 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి 2,76,583 కేసులు నమోదు కాగా.. గత ఇరవైనాలుగు గంటల్లో 9,985 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. మొట్ట మొదటిసారిగా యాక్టివ్ కేసులను రీకవరీ కేసులు మించిపోవడం విశేషం. 1,35,206 మంది రోగులు కోలుకోగా.. 1.33 లక్షల మంది ఇంకా హాస్పిటల్స్ లో చికిత్సలు పొందుతున్నారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 7,745 కి చేరింది. గత 24 గంటల్లో 279 మంది మృతి చెందారు. దేశంలో ఇంతవరకు సుమారు అయిదు కోట్ల మంది టెస్టులు చేయించుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తరువాత ఇండియా ఐదో స్థానానికి చేరింది. మహారాష్ట్రలో సామాజిక కరోనా వ్యాప్తి లేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ముంబైలో మంగళవారం కరోనా కేసులు 51వేలను మించిపోయాయి. ఈ సంఖ్య చైనాలోని వూహాన్ సిటీకన్నా సుమారు 700 ఎక్కువ.