వలస కూలీలకు కండోమ్ ప్యాకెట్లు… బీహార్ అధికారుల స్పెషల్ గిఫ్ట్

|

Jun 02, 2020 | 5:28 PM

లాక్‌డౌన్ కష్టాలకు ఎదురీదలేక నడుచుకుంటూ అయినా సొంతూరికి వెళ్లినవారు కొందరైతే… ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో సొంత రాష్ట్రానికి చేరుకున్నారు మరికొందరు. అక్కడికి చేరుకున్నవారికి ఆహార వస్తువులు, నగదు ఇచ్చి ఆదుకోంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే బీహార్ ప్రభుత్వ అధికారులు కొత్తగా ఆలోచించారు. వలస కూలీలకు కండోమ్స్‌ను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రానికి చేరుకుని 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న వలస కార్మికులకు కండోమ్ ప్యాకెట్లను చేతిలో పెట్టి టాటా.. బై బై.. చెబుతున్నారు. వీటిని […]

వలస కూలీలకు కండోమ్ ప్యాకెట్లు... బీహార్ అధికారుల స్పెషల్ గిఫ్ట్
Follow us on

లాక్‌డౌన్ కష్టాలకు ఎదురీదలేక నడుచుకుంటూ అయినా సొంతూరికి వెళ్లినవారు కొందరైతే… ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో సొంత రాష్ట్రానికి చేరుకున్నారు మరికొందరు. అక్కడికి చేరుకున్నవారికి ఆహార వస్తువులు, నగదు ఇచ్చి ఆదుకోంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

అయితే బీహార్ ప్రభుత్వ అధికారులు కొత్తగా ఆలోచించారు. వలస కూలీలకు కండోమ్స్‌ను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రానికి చేరుకుని 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న వలస కార్మికులకు కండోమ్ ప్యాకెట్లను చేతిలో పెట్టి టాటా.. బై బై.. చెబుతున్నారు. వీటిని ఉచితంగా అందిస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఫ్యామిలీ ప్లానింగ్‌లో భాగంగానే అంటూ గొప్పలు పోతున్నారు అక్కడి స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ఫ్యామిలీ ప్లానింగ్‌ అధికారులు.

అన్నమో రామచంద్రా అని వలస కార్మికులు అంటుంటే… కండోమ్ ప్యాకెట్లు చేతిలో పెట్టి సాగనంపటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నాయి అక్కడి ప్రజా సంఘాలు. బీహార్ అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది.