కరోనా ఎఫెక్ట్: పంజాబ్ సర్కార్ కీలక ఆదేశాలు..ఇక పెళ్లికి..

|

Jul 14, 2020 | 7:22 PM

కరోనా వల్ల పెళ్లిళ్లకు 50 మంది కన్నా ఎక్కువ మంది హాజరయ్యే పరిస్థితి లేదు. 50 మందితో వివాహ వేడుక ముగిస్తామంటూ పోలీసుల నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. అయితే, అక్కడి ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యను మరింత తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కరోనా ఎఫెక్ట్: పంజాబ్ సర్కార్ కీలక ఆదేశాలు..ఇక పెళ్లికి..
Follow us on

కరోనా వల్ల పెళ్లిళ్లకు 50 మంది కన్నా ఎక్కువ మంది హాజరయ్యే పరిస్థితి లేదు. 50 మందితో వివాహ వేడుక ముగిస్తామంటూ పోలీసుల నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. అయితే, అక్కడి ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యను మరింత తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పంజాబ్‌లో కరోనా ఉధ‌ృతి కొనసాగుతోంది. పెరుగుతున్న కరనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో బహిరంగ సభలను పూర్తిగా నిషేధించింది. అలాగే సామూహిక కార్యక్రమాలకు ఐదుగురు, పెళ్లిళ్లకు 30 మందికి మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ..అమరీందర్ సింగ్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గతంలో వివాహాలకు 50 మంది వరకూ హాజరయ్యేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు దీనిని మరింత కఠితనం చేశారు. ఈ నిబందనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.

పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నదాని ప్రకారం ఎవరైనాసరే సామాజిక కార్యక్రమాలను నిర్వహించే ముందు పోలీసులు, పరిపాలనాధికారులను తప్పనిసరిగా సంప్రదించాలని స్పష్టం చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని అధికారులు తెలిపారు.