64 రోజుల్లో రూ.6.45 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

|

May 20, 2020 | 12:07 PM

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ, కార్పొరేటు రుణగ్రహీతల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక రుణ సదుపాయాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద..

64 రోజుల్లో రూ.6.45 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్
Follow us on

మార్చి 1 నుంచి మే 15 మధ్యకాలం లో 54.96 లక్షల ఖాతాలకు రూ.6.45 లక్షల కోట్ల రుణాల ను జారీ చేశామని కేంధ్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్‌ చేశారు. ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ, రిటైల్‌ రంగాలు రుణాలు పొందిన రంగాలు జాబితాలో ఉన్నాయని చెప్పారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ మేరకు బ్యాంకులు రుణాలు జారీ చేశాయని ఆమె వెల్లడించారు. మే 8 నాటికి మంజూరు చేసిన రుణాలు రూ.5.95 లక్షల కోట్లు చెల్లించినట్లుగా నిర్మలా సీతారామన్ ట్విట్‌ ద్వారా స్పష్టం చేశారు.

రుణ మంజూరులో మే 8 తర్వాత గణనీయమైన వృద్ధి నమోదు అయ్యిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. మార్చి 1 నుంచి మే 15 మధ్యకాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకంగా రూ.6.45 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయని చెప్పారు.. మార్చి 20 నుంచి మే 15 మధ్యకాలంలో అత్యవసర రుణ ప్రణాళిక, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.03 లక్షల కోట్ల రుణాలను జారీ చేశాయని పేర్కొన్నారు. మే 8 తర్వాత ఏకంగా రూ.65,879 కోట్ల రుణాలను జారీ చేశాయని ఆమె వివరించారు.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ, కార్పొరేటు రుణగ్రహీతల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక రుణ సదుపాయాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద బ్యాంకులు అదనంగా 10 శాతం రుణాలను మంజూరు చేశాయి. ప్రస్తుత ఫండ్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ ఆధారంగా గరిష్ఠంగా రూ.200 కోట్ల మేర రుణాలను జారీ చేశాయని ట్విట్ చేశారు. అంతేకాకుండా రుణ వాయిదాల చెల్లింపులపై ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియాన్ని కూడా ప్రభుత్వరంగ బ్యాంకులు అమలు చేశాయని నిర్మలా సీతారామన్ తన ట్విట్ ద్వారా వెల్లడించారు.