ప్రపంచ నిబంధనల ప్రకారమే ‘కోవాక్సీన్’.. ఐసీఎంఆర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2020 | 8:09 PM

ప్రపంచ నిబంధనల ప్రకారమే వ్యాక్సీన్ అభివృధ్ది ప్రక్రియ ప్రారంభమైందని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటించింది. భారత ప్రజల సేఫ్టీ, వారి ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ బయో టెక్ తో..

ప్రపంచ నిబంధనల ప్రకారమే కోవాక్సీన్.. ఐసీఎంఆర్
Follow us on

ప్రపంచ నిబంధనల ప్రకారమే వ్యాక్సీన్ అభివృధ్ది ప్రక్రియ ప్రారంభమైందని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటించింది. భారత ప్రజల సేఫ్టీ, వారి ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ బయో టెక్ తో కలిసి పూణే లోని వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ చేబట్టిన కోవ్యాక్సీన్ తయారీ, క్లినికల్ ట్రయల్స్ సకాలంలో.. అంటే ఆగస్టు 14 లోగా పూర్తి చేయాలని కోరామని ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని పలు దేశాలు కోవిడ్-19 చికిత్స లో ఉపయోగపడే  సమర్థమైన వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తున్నాయని, ఇవి క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది. ఏమైనా దేశీయ వ్యాక్సీన్ మనకు చాలా అవసరమని, ఇది ఎంత త్వరగా పూర్తి అవుతుందా అని యావత్ దేశం ఎదురుచూస్తోందని ఈ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ వ్యాక్సీన్ తొలి,  రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.