పీఎం కీలక నిర్ణయం.. వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం..

| Edited By:

Jun 20, 2020 | 1:46 PM

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు మేలు చేకూర్చేలా 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన' పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో...

పీఎం కీలక నిర్ణయం.. వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం..
Follow us on

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు మేలు చేకూర్చేలా ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో బీహార్, యూపీ సీఎంలతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా మొదటగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝర్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. ఈ జిల్లాల్లో 125 రోజుల పాటు వలస కూలీలకు ఉపాధి కల్పిస్తారు. సాధారణ సేవల కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా 116 జిల్లాలోని గ్రామాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఈ పథకం ద్వారా 50 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే 25 రకాల పనులను చేపడతారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సహా 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Read More: 

ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం.. అప్లై చేసిన ప‌ది పనిదినాల్లో పెన్ష‌న్…

ఒకే రోజు ‘ఏడు స్పెషల్ డేస్’.. ప్రపంచం అంతంతో పాటు..