ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 90..

| Edited By:

Jun 04, 2020 | 4:02 PM

డిషాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మార్క్‌ను దాటి.. మూడు వేల దిశగా వెళ్తోంది. గురువారం నాడు తాజాగా మరో 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 90..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వెయ్యి లోపు ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఒడిషాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మార్క్‌ను దాటి.. మూడు వేల దిశగా వెళ్తోంది. గురువారం నాడు తాజాగా మరో 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,478కి చేరింది. వీటిలో 1,053 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం నాడు నమోదైన కేసుల్లో 79 మంది క్వారంటైన్‌లో ఉన్న వారికి వచ్చిందని.. మిగతా 11 స్థానికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇదిలా వుంటే.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏకంగా 24 గంటల్లో 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం అని సమాచారం. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.