బ్రెజిల్‌లో 3.5 మిలియన్లకు చేరిన పాజిటివ్ కేసులు

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నమోదవతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో..

బ్రెజిల్‌లో 3.5 మిలియన్లకు చేరిన పాజిటివ్ కేసులు

Edited By:

Updated on: Aug 21, 2020 | 5:35 PM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నమోదవతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అగ్ర స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉండగా.. ఇక మూడో స్థానంలో భారత్‌ ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా కొత్తగా 45,323 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 35,01,975కి చేరింది. ఈ విషయాన్ని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,12,304 మంది మరణించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 22.5 మిలియన్ కరోనా
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 5.5 మిలియన్‌ పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. బ్రెజిల్‌లో 3.5 మిలియన్ కేసులు నమోదయ్యాయి.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం